![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 417 లో....ఇదంతా నా వల్లే కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా నేనే చూస్తానని కావ్య అనగానే.. వద్దు ఇక నువ్వేం పట్టించుకోకు.. ఇప్పటిదాకా చేసింది చాలని రాజ్ అంటాడు. నువ్వు మంచి మనసుతో అంత మంచి జరగాలని కోరుకున్నావ్ కానీ అందరు నీలాగా ఉండరని తెలుసుకోలేకపోయావ్.. చూద్దాం ఏం జరుగుతుందోనని సుభాష్ అంటాడు.
ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి మాయ వస్తుంది. యాక్టింగ్ బాగా చేసానా అని మాయ అడుగగా.. జీవించావని రుద్రాణి చెప్తుంది. మంచిగా బ్రతకాలంటే ఇలానే చెయ్యాలి కదా అని మాయ అంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి ఇదంతా నీ ప్లానేనా మమ్మీ నాక్కూడా తెలియకుండా ఇదంతా చేసావా అని రాహుల్ అంటాడు. కత్తిని రెడీ చేసి ఇన్ని రోజులు సానపెట్టానని రుద్రాణి అంటుంది. నన్ను తక్కువ అంచనా వేసావని రుద్రాణి అనగానే.. అప్పుడే కావ్య వస్తుంది. అవును నేను కూడా తక్కువ అంచనా వేసానని అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మాయ ఏదో కవర్ చేస్తుంటే.. అంత వినేసానని కావ్య అంటుంది. ఇప్పుడు వింటే ఏం చేస్తావ్? అంత నేనే చేశాను ఇదంతా నా ప్లాన్ అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు వెళ్లి అందరి ముందు ఇదంతా చెప్పగలవా చెప్పలేవు. నువ్వు మా అన్నయ్య మాట్లాడుకున్నది.. నేను విన్నాను. వాడు మా అన్నయ్య కొడుకు అని తెలుసు. నువ్వు అడ్రస్ పట్టుకొని వెళ్తుంటే నేను ఒక ముసలావిడతో ఈ మాయ అడ్రెస్ చెప్పించి.. నిన్ను ఈ మాయ దగ్గరికి వెళ్లేలా చేశాను. ఇదంతా చేసింది నేనే వెళ్లి చెప్తావా అని రుద్రాణి అంటుంది. చెప్తాను కానీ ఇప్పుడు కాదు ఎప్పుడు నీకంటే ఒక అడుగు ముందు నేనుంటాను.. అప్పటివరకు చిన్న విరామం తీసుకోమని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు మమ్మీ కావ్యని రెచ్చగొడుతున్నావని రాహుల్ అంటాడు. కావ్య ఒక సెంటిమెంటల్ ఫూల్.. అది ఏం చెయ్యలేదు.. నేనే మాయని అడ్డు పెట్టుకొని కుటుంబాన్ని ఎలా విడకొడతానో చూడని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత మాయ రాజ్ దగ్గరికి వచ్చి.. సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. ఎందుకు వచ్చావని రాజ్ కోప్పడతాడు. ఇక్కడే నీ భార్యగా సెటిల్ అవ్వాలని మాయ అంటుంది. దాంతో రాజ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. ఇప్పటివరకు ఏం డిస్కషన్ చేశారని అడుగుతుంది. బెదిరించానని రాజ్ అనగానే.. నేను చూసానని కావ్య అంటుంది. ఇదంతా నీ వల్లే.. దాన్ని ఎక్కడ నుండి తీసుకొని వచ్చావే అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో మాయ కాఫీ తీసుకొని ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది. నాకు కావ్య తప్ప ఎవరిచ్చిన నచ్చదని ఇందిరాదేవి అంటుంది. కావ్య, మాయ ఇద్దరు ఒకేసారి అపర్ణకి కాఫీ తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |